Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను వీడని కష్టాలు... తాజాగా కేసు నమోదు

  • ఇటీవల పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఖాన్
  • అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో ఓటమి
  • తాజాగా ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆరోపణ
  • ఇమ్రాన్ సహా 150పై మంది కేసు
Police files case against Pakistan former PM Imran Khan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటీవల సొంత పార్టీలోనే అసమ్మతి పోటు కారణంగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్... అత్యంత అవమానకర రీతిలో ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. అయితే, తాజాగా ఆయనపై పాకిస్థాన్ లో కేసు నమోదైంది. 

ఇటీవల సౌదీ అరేబియాలోని ఓ ప్రార్థనా మందిరం వద్ద పాక్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ ఇమ్రాన్ సహా 150 మందిపై కేసు నమోదు చేశారు. ఇమ్రాన్, మాజీ మంత్రులు షాబాజ్ గుల్, షేక్ రషీద్, ఫవాద్ చౌదరి తదితరులు "ప్రధాని షాబాజ్ ద్రోహి, దొంగ" అంటూ నినాదాలు చేశారని పోలీసులు సెక్షన్ 295(ఏ) కింద అభియోగాలు మోపారు. వీరు నినాదాలు చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ మేరకు స్పందించారు. 

అయితే, దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తాను ఎలాంటి నినాదాలు చేయలేదని వెల్లడించారు. కానీ ప్రజలే స్వచ్ఛందంగా మదీనాలోని మసీదు నుంచి వెలుపలికి వచ్చి ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను వెలిబుచ్చారని వివరించారు. ఆ ప్రార్థనామందిరం వద్ద ప్రజాగ్రహం పెల్లుబుకిందని, అంతే తప్ప నినాదాలు చేయాలంటూ తాము ఎవరినీ ఆహ్వానించలేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాలకులకు బయటికి వచ్చి తమ ముఖాలు చూపించుకునే దమ్ముందా? అంటూ సవాల్ చేశారు.

More Telugu News