Chiranjeevi: 'ఆచార్య'లో ఆ ప్రయోగం కూడా ఫలించదాయే!

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'ఆచార్య'
  • వాయిస్ ఓవర్ తోనే మొదలైన కన్ ఫ్యూజన్
  • కొరటాలకి విమర్శలు తెస్తున్న ఫ్లాష్ బ్యాక్ సీన్ 
  • పాతకాలం నాటి చిరంజీవిని చూపించాలనే ప్రయత్నం విఫలం
Acharya movie update

చిరంజీవి - చరణ్ కథానాయకులుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'ఆచార్య' సినిమా నిన్ననే థియేటర్స్ కి వచ్చింది. ఈ సినిమాలో కొరటాల పెట్టిన 'ధర్మస్థలి' .. ' పాదఘట్టం' .. ' సిద్ధవనం' .. 'జీవధార' పేర్లు చాలా బాగున్నాయి. కానీ అవన్నీ దగ్గర దగ్గరలోనే ఉండటం వలన .. ఆ పేర్లన్నీ ఒకేసారి పరిచయం చేయాలనే ప్రయత్నం కారణంగా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. 

ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి వస్తుంది. పసివాడైన చరణ్ ను రక్షించే బాధ్యత చిరంజీవి భుజాలపై పడుతుంది. అప్పుడు గ్రాఫిక్స్ సాయంతో 'పునాదిరాళ్లు' .. 'ప్రాణం ఖరీదు' సమయం నాటి చిరంజీవిని తెరపై చూపించారు. అది కాస్తా కుదరలేదు. ఈ సీన్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని భావించిన కొరటాలకి విమర్శలు తప్పడం లేదు. 

ఇక 'ధర్మస్థలి' సెట్ గురించి మొదటి నుంచి చాలా గొప్పగా చెబుతూ వచ్చారు. కానీ ఆ సెట్ ఆశించిన స్థాయిలో కనిపించలేదు. భారీ తనం సంగతి అటుంచితే సహజత్వం లోపించింది. సెట్ అనే విషయం తెలిసిపోతుంటుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ఈ వీకెండ్ నాటికి ఏ స్థాయిలో వసూలు చేస్తుందనేది చూడాలి.

More Telugu News