Srinu Vaitla: శ్రీను వైట్లతో ఆ సీక్వెల్ లేనట్టేనట!

  • గతంలో విష్ణుకి 'ఢీ' సినిమాతో హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల
  • ఆ సినిమాకి సీక్వెల్ చేసే దిశగా జరిగిన ప్రయత్నాలు 
  • ఈ లోగానే మరో సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విష్ణు 
  • మరో కథను రెడీ  చేస్తున్న శ్రీను వైట్ల 
Manchu Vishnu new movie update

శ్రీను వైట్ల తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి వరుస హిట్లు ఇస్తూ వచ్చాడు. ఆయన సినిమాల్లోని కామెడీ ఎపిసోడ్స్  తలచుకుని .. తలచుకుని నవ్వేలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు వరుస పరాజయాలను చూస్తూ వచ్చాయి. దాంతో సహజంగానే ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. 

ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు హీరోగా ఆయన 'ఢీ' సీక్వెల్ చేయాలనుకున్నాడు. 'డీ అండ్ డీ' అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్లో చేయనున్నట్టు విష్ణు చెప్పాడు. అయితే పట్టాలపైకి మాత్రం వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందా .. లేదా? అనే సందేహం అందరిలోను ఉంది. 

ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టేననే టాక్ తాజాగా వినిపిస్తోంది. శ్రీను వైట్ల మరో కథను మరో హీరోతో చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు. మంచు విష్ణు మాత్రం ప్రస్తుతం తన సొంత బ్యానర్లో 'గాలి నాగేశ్వరరావు' చేస్తున్నాడు. సన్నిలియోన్ ఒక నాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగు జరుపుకుంటోంది.

More Telugu News