Samantha: 'శాకుంతలం' నుంచి సమంత స్పెషల్ పోస్టర్!

  • సమంత బర్త్ డే సందర్భంగా 'శాకుంతలం' పోస్టర్ విడుదల  
  •  'యశోద' సినిమాలోను ఆమె ప్రధానమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే
  • రీసెంట్ గా విజయ్ దేవరకొండ జోడీ గాను ఆమె ఎంపిక  
  • ఈ సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే విడుదల 
Shakunthalam Movie Special Poster Released

తెలుగు .. తమిళ భాషల్లో సమంతకి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ ఏడాది హిందీలోనూ బిజీ కావాలనే పట్టుదలతో ఆమె ఉంది. ఈ నేపథ్యంలో తెలుగులో ఆమె చేసిన 'శాకుంతలం' విడుదల దిశగా పనులను జరుపుకుంటోంది. నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ రోజున సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా 'శాకుంతలం' సినిమా నుంచి  సమంత స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'శకుంతల' పాత్రలో సమంత చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు.

ఇక తెలుగులో సమంత నాయిక ప్రధానమైన 'యశోద' సినిమా కూడా చేస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన కూడా ఆమె ఒక సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.

More Telugu News