YSRCP: గెలిచే వారికే టికెట్లు.. గెల‌వ‌లేని వారు ప‌క్క‌కే: జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

  • జూలై 8న పార్టీ ప్లీన‌రీ
  • మే 10 నుంచి గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీపీ
  • ఏ ఒక్క‌రూ ప్ర‌త్యేకం అని భావించ‌రాదన్న జగన్ 
  • ఎన్నికల్లో గెలిచేందుకు వ‌న‌రులు స‌మ‌కూరుస్తామని వెల్లడి 
ys jagan warning to ysrcp mals and ministers

పార్టీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశం సంద‌ర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామ‌న్న ఆయ‌న... గెల‌వ‌లేని వారిని ప‌క్క‌న‌పెట్టేస్తామ‌ని కరాఖండీగా చెప్పేశారు. జులై 8న పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌కటించిన జ‌గ‌న్‌... మే 10న గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మాన్ని ప్రార‌భించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాత మంత్రులు, జిల్లా అధ్య‌క్షుల‌కు కీల‌క భాధ్య‌త‌లు అప్ప‌గిస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు. రెండేళ్ల‌లో ఎన్నిక‌ల‌కు వెళుతున్నామ‌న్న జ‌గ‌న్‌... ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ హెచ్చరిక‌లు జారీ చేశారు. ఎన్నిక‌ల్లో గెలిచే ప‌రిస్థితి లేనివారిని ప‌క్కన‌పెట్ట‌నున్న‌ట్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రికైనా పార్టీనే సుప్రీం అని చెప్పిన జ‌గ‌న్‌... గెలిచిన వారికే మంత్రి ప‌ద‌వులు దక్కుతాయ‌ని చెప్పారు. గెలిచేందుకు కావాల్సిన వ‌న‌రుల‌ను స‌మ‌కూరుస్తాన‌ని కూడా జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.  ఏ ఒక్క‌రు కూడా తాము ప్ర‌త్యేకం అనుకోవ‌డానికి వీల్లేద‌ని కూడా జ‌గ‌న్ హెచ్చ‌రించారు.

More Telugu News