YSRCP: జ‌గ‌న్ కీల‌క స‌మావేశం... 2024 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా వ్యూహాల‌పై స‌మాలోచ‌న‌

  • వైసీపీ అధినేత హోదాలో జ‌గ‌న్ స‌మావేశం
  • పార్టీ నేత‌లు, జిల్లా అధ్య‌క్షుడు, రీజ‌న‌ల్ కో ఆర్డినేటర్ల హాజ‌రు
  • మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కూ ఆహ్వానం
  • ఎన్నిక‌ల్లో గెలుపు వ్యూహాల‌పై చ‌ర్చించ‌నున్న జ‌గ‌న్‌
ys jagan meeting with party leaders over 2024 elections

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాసేప‌ట్లో ఓ కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు. వైసీపీ అధినేత హోదాలో జ‌గ‌న్ నిర్వ‌హించ‌నున్న ఈ స‌మావేశానికి మంత్రులు,  ఎమ్మెల్యేలు,  ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీలో వివిధ స్థాయుల్లో ఉన్న కీల‌క నేత‌లంతా హాజ‌రు కానున్నారు. పార్టీలో కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జిల్లా అధ్య‌క్షులు, రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లు ఈ భేటీలో కీల‌కంగా మార‌నున్నారు.

వైసీపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మూడేళ్లు దాటిపోతోంది. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు రానున్నాయి. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై జ‌గ‌న్ ఈ భేటీలో కీల‌క స‌మాలోచ‌న‌లు చేయ‌నున్నారు. అనుభ‌వం ఉన్న పార్టీ నేత‌ల నుంచి స‌లహాలు, సూచ‌న‌లు తీసుకోనున్న ఆయ‌న ఎన్నిక‌ల్లో పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహంపై నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు.

More Telugu News