Junior NTR: 'ఆర్ ఆర్ ఆర్' నుంచి 'ఎత్తర జెండా' ఫుల్ సాంగ్ .. చూసేయండి!

  • భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్'
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
  • ఎన్టీఆర్ .. చరణ్ స్టెప్స్ హైలైట్
  • పాట చివరలో మెరిసిన రాజమౌళి  
RRR movie update

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా చాలా వేగంగా 1000 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. అయన స్వరపరిచిన పాటలు ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. 

అలాంటి పాటల్లో 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా .. సత్తువ ఉరిమితే కొట్టర కొండా ' ఒకటి. కొంతసేపటి క్రితం పూర్తి పాటను విడుదల చేశారు. ఎన్టీఆర్ .. చరణ్ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు వేసిన పాట ఇది. స్వాతంత్ర్య  సమరయోధులు .. మహావీరుల చిత్రాలను చూపుతూ సాగే ఈ పాట దేశభక్తిని పెంచుతూ ఉత్సాహభరితంగా నడుస్తుంది. 

ఎన్టీఆర్ .. చరణ్ లతో కలిసి అలియా స్టెప్పులు వేసిన పాట ఇది. ఈ పాటలో రాజమౌళి కనిపించడం మరో విశేషంగా అనిపిస్తుంది. సినిమాలో రోలింగ్ టైటిల్స్ సమయంలో ఈ పాట వస్తుంది. అప్పుడు థియేటర్లో నుంచి బయటికి వచ్చే  తొందరలో ఉన్నవారు ఈ పాటను ఇప్పుడు కూల్ గా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.

More Telugu News