YSRCP: ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోవడం లేదు: వైసీపీ నేత స‌జ్జ‌ల ప్ర‌క‌ట‌న‌

  • థ‌ర్డ్ పార్టీ సేవ‌ల‌ను వినియోగించుకుంటున్నామన్న సజ్జల 
  • పీకే సేవ‌ల‌ను వినియోగించుకోవ‌డం లేద‌ని వివరణ 
  • ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో వైసీపీ కీల‌క నిర్ణ‌యం
sajjala ramakrishnareddy comments on prashant kishor services

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ సేవ‌ల‌ను వినియోగించుకోవ‌డం లేద‌ని ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌శాంత్ కిశోర్ సేవ‌ల‌కు బ‌దులుగా థ‌ర్డ్ పార్టీ సేవ‌ల‌ను వినియోగించుకుంటున్నామ‌ని ఆ పార్టీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళ‌వారం నాడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

2014 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప మార్జిన్‌తో చాలా సీట్ల‌లో ఓడిన వైసీపీ... అధికారం చేజిక్కించుకోవ‌డంలో విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌శాంత్ కిశోర్ ను పార్టీ రాజ‌కీయ వ్యూహ‌కర్త‌గా నియ‌మించుకున్న వైసీపీ... ప్ర‌చారంలో వైరి వ‌ర్గాల‌ను దాటేసి స‌త్తా చాటింది. పీకే వ్యూహాల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేసిన వైసీపీ 2019 ఎన్నిక‌ల్లో రికార్డు విక్ట‌రీ కొట్టింది. తాజాగా మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో పీకే సేవ‌ల‌ను వినియోగించుకోవ‌డం లేదంటూ ఆ పార్టీ నుంచి ప్ర‌క‌ట‌న రావ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News