Ram: బోయపాటికి విషెస్ చెప్పిన రామ్ మూవీ టీమ్!

  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'ది వారియర్'
  • బోయపాటితో సెట్స్ పైకి రామ్ 
  • తెరపైకి రష్మిక మందన పేరు  
  •  ఐదు భాషల్లో విడుదల
Ram and Boyapati movie update

బోయపాటి ప్రస్తుతం రామ్ సినిమా చేస్తున్నాడు. ఈ రోజున బోయపాటి పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా టీమ్ ఆయన కి విషెస్ చెబుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. బోయపాటి తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. కొత్త లుక్ తో రామ్ ను చూపించనున్నాడు. 
 
రామ్ కి ఇది ఫస్టు పాన్ ఇండియా సినిమా అని తెలుస్తోంది. అందువలన బోయపాటి ఆ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడట. కథాకథనాల పరంగా .. యాక్షన్ దృశ్యాల పరంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. కథానాయికగా ఆయన రష్మికను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. 
 
ఇంతవరకూ రామ్ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అనుకునేలా ఆయన ట్రీట్మెంట్ ఉండనుందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రామ్ 'ది వారియర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో ఉన్నాడు.

More Telugu News