Chalo CMO: రేపటి 'ఛలో సీఎంవో' కార్యక్రమానికి అనుమతి లేదు: విజయవాడ సీపీ

  • సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ డిమాండ్
  • రేపు 'ఛలో సీఎంవో' కార్యక్రమం
  • ఉద్యోగులు ఎవరూ పాల్గొనరాదన్న సీపీ
  • విజయవాడలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30
Vijayawada CP saya there is no permission to Chalo CMO

సీపీఎస్ రద్దుపై గతంలో జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న డిమాండ్ తో యూటీఎఫ్ రేపు ఛలో సీఎంవో కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే యూటీఎఫ్ నిర్వహించదలిచిన 'ఛలో సీఎంవో' కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. అనుమతి లేని కార్యక్రమంలో ఉద్యోగులు ఎవరూ పాల్గొనరాదని, ఒకవేళ పాల్గొంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పైగా విజయవాడలో 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంటుందన్న విషయాన్ని ఉద్యోగులు గమనించాలని అన్నారు. 

కాగా, పోలీసులు అడ్డుకున్నా సరే, ఛలో సీఎంవో కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని యూటీఎఫ్ నాయకులు అంటున్నారు. కాగా, ఛలో సీఎంవోకు వెళుతున్న యూటీఎఫ్ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ గృహనిర్బంధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News