TTD: తిరుమలలో ఎల్‌ఈడీ స్క్రీన్‌పై సినిమా పాటలు.. స్పందించిన ఈవో ధర్మారెడ్డి

  • బ్రాడ్‌కాస్ట్ ఉద్యోగి స్నేహితుడి తప్పిదంతోనే సినిమా పాటలన్న ఈవో
  • ఉద్యోగి తన స్నేహితుడిన బ్రాడ్‌కాస్ట్ గదిలోకి తీసుకెళ్లాడని వివరణ
  • విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు
TTD EO Dharma Reddy Responds About movie songs on ttd led screen

తిరుమలలోని ఎల్‌ఈడీ స్క్రీన్‌పై శుక్రవారం సినిమా పాటలు ప్రత్యక్షం కావడంపై టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. బ్రాడ్‌కాస్ట్ ఉద్యోగి స్నేహితుడి కారణంగా ఈ సమస్య తలెత్తినట్టు చెప్పారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై సినిమా పాటలు ప్రసారం కావడాన్ని తొలుత సాంకేతిక సమస్యగా గుర్తించినట్టు చెప్పారు. అయితే, ప్రాథమిక విచారణ అనంతరం బ్రాడ్‌కాస్టింగ్ ఉద్యోగి స్నేహితుడే ఇందుకు కారణమని తేలిందన్నారు. 

ఉద్యోగి తన స్నేహితుడిని బ్రాడ్‌కాస్ట్ గదిలోకి తీసుకెళ్లాడని, ఆ తర్వాత అతడిని అక్కడే ఉంచి వేరే పనిపై వైకుంఠం-2 వరకు ఆయన వెళ్లినట్టు ఈవో తెలిపారు. బ్రాడ్‌కాస్ట్ గదిలో ఉన్న అతడి స్నేహితుడు అక్కడ ఉన్న రిమోట్‌తో ఆపరేట్ చేయడంతో సినిమా పాటలు ప్రసారమైనట్టు ధర్మారెడ్డి వివరించారు. బాధ్యలుపై చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News