Toss: మరోసారి సన్ రైజర్స్ దే టాస్.... బెంగళూరుతో మ్యాచ్

  • ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో మ్యాచ్
  • వరుసగా ఏడోసారి టాస్ నెగ్గిన కేన్ విలియమ్సన్
  • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • ఛేదనను విజయమంత్రంగా మార్చుకున్న వైనం
  • వరుసగా నాలుగు మ్యాచ్ లలో లక్ష్యఛేదన
Once again SRH won the toss

ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా టాస్ లు నెగ్గుతోంది. ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్ టాస్ గెలిచాడు. విలియమ్సన్ టాస్ గెలవడం ఇది వరుసగా ఏడోసారి. ఈ మ్యాచ్ లోనూ టాస్ గెలిచి ఎప్పట్లాగానే బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీ ఆరంభ దశ నుంచి సన్ రైజర్స్ ఇదే వ్యూహం అమలు చేస్తోంది. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం, ప్రత్యర్థిని ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేయడం, ఆపై టాపార్డర్ సాయంతో లక్ష్యఛేదన చేయడం... ఇదీ సన్ రైజర్స్ అనుసరిస్తున్న ప్రణాళిక. 

తొలి రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైనప్పటికీ, ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ లలో గెలిచిన తీరు సన్ రైజర్స్ ప్రణాళికాబద్ధమైన ఆటతీరుకు, క్రమశిక్షణకు నిదర్శనం. ఇవాళ బెంగళూరుతో మ్యాచ్ లోనూ ఇదే తరహా వ్యూహం అమలు చేయాలని విలియమ్సన్ బృందం భావిస్తోంది. 

ఈ మ్యాచ్ కు ముంబయిలోని బ్రాబౌర్న్ స్టేడియం వేదిక. గెలుపు సూత్రాన్ని చక్కగా ఒడిసిపట్టిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు బెంగళూరు జట్టు కూడా మార్పుల్లేకుండానే బరిలో దిగుతోంది. బెంగళూరు జట్టు టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడి, 5 విజయాలు సాధించింది. తద్వారా 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

More Telugu News