Ram: 'బుల్లెట్' స్పీడ్ తో దూసుకుపోతున్న రామ్ సాంగ్!

  • రామ్, కృతిశెట్టి జంటగా 'ది వారియర్'
  • లింగుసామి దర్శకత్వం 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ 
  • జులై 14వ తేదీన విడుదల
The Warrierr Movie Song Released

రామ్ మరోసారి మాస్ కంటెంట్ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. 'ది వారియర్' సినిమాతో రంగం దిగుతున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు. పోలీస్ ఆఫీసర్ గా రామ్ కనిపించనున్న ఈ సినిమాలో కథానాయకగా కృతి శెట్టి అలరించనుంది. 

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 'నా పక్కకి నువ్వే వస్తే హార్టు  బీటే స్పీడ్ అవుతుంది .. ఓ టచ్చే నువ్వే ఇస్తే నా బ్లడ్డే హీట్ అవుతుంది" అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటను తమిళ హీరో శింబు ఆలపించడం విశేషం.

ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. పాటకి తగిన స్టెప్పులతో రామ్ -  కృతి శెట్టి చెలరేగిపోయారు. రామ్ మంచి డాన్సర్ అనే సంగతి తెలిసిందే. ఆయనతో పోటీపడుతూ కృతి శెట్టి డాన్స్ చేసిందనే చెప్పాలి. జోరుగా ..   హుషారుగా సాగిపోయే ఈ పాట మాస్ ఆడియన్స్ మనసుకి పట్టేసేలానే ఉంది. జులై 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ పాటను కూడా రిలీజ్ చేశారు.

More Telugu News