Yash: "థాంక్యూ అల్లు అర్జున్ అవరే" అంటూ స్పందించిన కన్నడ హీరో యశ్

  • ఈ నెల 14న రిలీజైన కేజీఎఫ్-2
  • రాఖీ భాయ్ గా విశ్వరూపం ప్రదర్శించిన యశ్
  • వారం రోజుల్లో రూ.700 కోట్లు వసూలు
  • రఫ్ఫాడించేశారంటూ అల్లు అర్జున్ కితాబు
  • వినమ్రంగా బదులిచ్చిన యశ్
Kannada Hero Yash thanked Allu Arjun

కేజీఎఫ్-2 చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో, ఆ చిత్ర హీరో యశ్ ను, ఇతర యూనిట్ సభ్యులను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ సినిమాలో యశ్ మంత్రముగ్ధుల్ని చేసేలా కనిపించారని, తన నటనా తీవ్రతతో రఫ్పాడించేశాడని కితాబునిచ్చారు. ఈ మేరకు బన్నీ ట్వీట్ చేశారు. దీనిపై కన్నడ హీరో యశ్ స్పందించారు. 

"థాంక్యూ అల్లు అర్జున్ అవరే (గారు)" అంటూ వినమ్రంగా బదులిచ్చారు. "మీరు ఓ సినిమా కోసం మిమ్మల్ని మీరు మలుచుకునే తీరును, మీ కఠోర శ్రమను ఎల్లప్పుడు అభిమానిస్తుంటాను. మీరు ఎప్పట్లాగే అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను... చీర్స్" అంటూ యశ్ పేర్కొన్నారు. 

ఈ నెల 14న రిలీజైన కేజీఎఫ్-2 చిత్రం వారం రోజుల్లోనే రూ.700 కోట్లతో బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది. బాలీవుడ్ లో సైతం కేజీఎఫ్-2 దెబ్బకు అనేక పాత రికార్డులు తెరమరుగయ్యాయంటే రాఖీ భాయ్ సత్తా ఏంటో అర్థమవుతుంది.

More Telugu News