Lucky Lakshman: 'లక్కీ లక్ష్మణ్' నుంచి మోషన్ పోస్టర్ విడుదల

  • సోహెల్, మోక్ష జంటగా లక్కీ లక్ష్మణ్
  • ఏఆర్ అభి దర్శకత్వంలో చిత్రం
  • ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న లక్కీ లక్ష్మణ్
Motion Poster from Lucky Lakshman

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, మోక్ష జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం లక్కీ లక్ష్మణ్. వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ అభి దర్శకత్వం వహిస్తున్నాడు. సినీ అతిరథుల మధ్య ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా మోషన్ పోస్టర్ రిలీజైంది. 

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. ప్రవీణ పూడి (ఎడిటింగ్), ఐ ఆండ్రూ (కెమెరా) వంటి ప్రతిభావంతులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో దేవి ప్రసాద్, రాజా రవీందర్, సమీర్ తదితరులు నటిస్తున్నారు.

More Telugu News