Sensex: వారాన్ని నష్టాల్లో ముగించిన మార్కెట్లు

  • 714 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 220 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా కోల్పోయిన ఎస్బీఐ
Markets ends in loses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. కీలక రేట్లను అమెరికా సెంట్రల్ బ్యాంకు పెంచుతుందనే భయాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 714 పాయింట్లు నష్టపోయి 57,197కి దిగజారింది. నిఫ్టీ 220 పాయింట్లు కోల్పోయి 17,171కి పడిపోయింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (0.98%), భారతి ఎయిర్ టెల్ (0.50%), మారుతి (0.35%), ఏసియన్ పెయింట్స్ (0.26%), ఐటీసీ (0.25%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.08%), హిందుస్థాన్ యూనిలీవర్ (-3.06%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.94%), డాక్టర్ రెడ్డీస్ (-2.86%), యాక్సిస్ బ్యాంక్ (-2.73%).

More Telugu News