Allu Arjun: 'కేజీఎఫ్-2' సినిమాపై హీరో అల్లు అర్జున్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

  • కేజీఎఫ్‌-2 సినిమా యూనిట్‌కు బన్నీ అభినంద‌న‌లు
  • ఈ సినిమాలో య‌శ్ న‌ట‌న అద్భుతమన్న అర్జున్ 
  • ప్ర‌శాంత్ నీల్ సినిమాను రూపొందించిన తీరు చాలా బాగుందన్న ఐకాన్ స్టార్ 
Allu Arjun   Big congratulations to KGF2

కన్నడ హీరో యశ్ న‌టించిన 'కేజీఎఫ్-2' సినిమా భారీ విజ‌యాన్ని అందుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. 'కేజీఎఫ్‌-2 సినిమా యూనిట్‌కు అభినంద‌న‌లు. ఈ సినిమాలో య‌శ్ న‌ట‌న అద్భుతం. సంజ‌య్ ద‌త్, రవీనా టాండన్, శ్రీ‌నిధి శెట్టి పాత్రలు అంద‌రినీ ఆకర్షించేలా ఉన్నాయి. సంగీత ద‌ర్శ‌కుడు రవి బస్రూర్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. 

ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్లు అంద‌రికీ అభినంద‌న‌లు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ గారు సినిమాను రూపొందించిన తీరు చాలా బాగుంది. గొప్ప సినిమాను చూసిన అనుభ‌వాన్ని అందించినందుకు, భార‌తీయ సినిమాను శిఖ‌ర స్థాయిలో నిలిపినందుకు ఈ సినిమా యూనిట్‌కు కృత‌జ్ఞ‌త‌లు' అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

More Telugu News