Venkatesh: 'ఎఫ్ 3' నుంచి మాస్ ను ఊపేసే సాంగ్ .. చూసేయండి!

  • అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 3'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ 
  • స్పెషల్ సాంగులో మెరవనున్న పూజ హెగ్డే
  • మే 27వ తేదీన విడుదల   
F3 movie update

వెంకటేశ్ - వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా 'ఎఫ్ 3' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా అందాల సందడి చేసే ఈ సినిమాను, మే 27వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన 'ఊ ఆ అహ అహ' అనే పాటను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సునిధి చౌహాన్ .. లవిత లోబో .. సాగర్ .. అభిషేక్ ఆపించారు. ప్రధానమైన జంటలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ ఇది.

ఈ పాటలో తమన్నా .. మెహ్రీన్ తో పాటు సోనాల్ కూడా మెరవడం విశేషం. మాస్ ఆడియన్స్ కోసం దేవిశ్రీ చేసిన ఈ ట్యూన్ వాళ్లకి కనెక్ట్ అయ్యేలానే ఉంది. రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. అంజలి .. సంగీత ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ కానుంది.

More Telugu News