Sensex: ఐఎంఎఫ్ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 874 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 256 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
  • మూడున్నర శాతం పెరిగిన ఎం అండ్ ఎం షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. భారత్ గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 874 పాయింట్లు లాభపడి 57,912కి చేరుకుంది. నిఫ్టీ 256 పాయింట్లు పెరిగి 17,393కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.50%), మారుతి (2.70%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.46%), ఏసియన్ పెయింట్స్ (2.38%), రిలయన్స్ (2.35%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-0.88%), భారతి ఎయిర్ టెల్ (-0.63%), నెస్లే ఇండియా (-0.60%).

More Telugu News