TDP Mahanadu: టీడీపీ మహానాడు ఒక్క రోజుకే పరిమితం.. ఈసారి ఒంగోలులో!

  • ఈసారి ఒంగోలు శివారులో మహానాడు
  • 27న నాలుగైదు వేల మంది ప్రతినిధులతో సమావేశం
  • నేడు టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు
TDP Mahanadu Restrict to One day Only This Time

ఈసారి మహానాడును ఒక్క రోజే నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు మహానాడు వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కరోనా నేపథ్యంలో రెండేళ్లపాటు ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి ప్రత్యక్షంగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. అయితే, ఈసారి ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న ఒక్క రోజుకే మహానాడును పరిమితం చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో ఈసారి ఒంగోలు శివారులో మహానాడును నిర్వహించనున్నారు. అంతకుముందు రోజు నాలుగైదు వేల మంది ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 28న నిర్వహించే మహానాడుకు ఎవరైనా హాజరుకావొచ్చని టీడీపీ నేతలు తెలిపారు. అలాగే, ఆ రోజు నిర్వహించే భారీ బహిరంగ సభలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించి ఏడాదిపాటు కొనసాగిస్తారు.

 అలాగే, నేడు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభిస్తారు. వాట్సాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్‌ల ద్వారానూ సభ్యత్వం తీసుకోవచ్చు. అలాగే, ఇప్పటికే తీసుకున్నవారు సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవచ్చు.

More Telugu News