Brij Mohan: స్కూటర్ ఖరీదు రూ.71 వేలు... ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.15 లక్షలు!

  • చండీగఢ్ లో ఘటన
  • హోండా యాక్టివా కొనుగోలు చేసిన వ్యాపారి
  • ఫ్యాన్సీ నెంబరు కోసం వేలం
  • 0001 నెంబరు కోసం రూ.15.44 లక్షలు
Businessman garbs fancy number for his activa scooter

కొందరు తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని కోరుకుంటారు. మరికొందరు తమ లక్కీ నెంబరే వాహన రిజిస్ట్రేషన్ నెంబరు అయితే బాగుంటుందని భావిస్తారు. చండీగఢ్ కు చెందిన బ్రిజ్ మోహన్ అనే వ్యాపారి కూడా ఆ కోవకే చెందుతాడు. అయితే ఈయన కాస్తంత డిఫరెంట్. ఎందుకంటే తన స్కూటర్ కు ఫ్యాన్సీ నెంబరు కోసం ఏకంగా రూ.15 లక్షలకు పైగా చెల్లించాడు. 

ఆ వ్యాపారి ఇటీవల రూ.71 వేలతో హోండా యాక్టివా స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే '0001' అనే ఫ్యాన్సీ నెంబరు కోరుకున్న అతగాడు ఆర్టీఏ వేలంలో రూ.15.44 లక్షలకు దాన్ని సొంతం చేసుకున్నాడు. వేలంలో ఆ నెంబరు ప్రారంభ ధర రూ.5 లక్షలు కాగా బ్రిజ్ మోహన్ చివరి వరకు వేలంలో నిలిచి తనకిష్టమైన నెంబరును దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ అయింది. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టింది ఓ స్కూటర్ నెంబరు కోసమా..? అంటూ నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News