Krishna: భార్యకు కేక్ తినిపించిన సూపర్ స్టార్ కృష్ణ... ఫొటో ఇదిగో!

  • నేడు ఇందిరాదేవి పుట్టినరోజు
  • కేక్ కట్ చేయించిన కుటుంబ సభ్యులు
  • కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ
  • ఫొటోలను పంచుకున్న మంజుల ఘట్టమనేని
Superstar Krishna attends wife Indira Devi birthday celebrations

సూపర్ స్టార్ కృష్ణ అర్ధాంగి ఇందిరాదేవి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు వేడుక నిర్వహించారు. ఈ సంబరాల్లో కృష్ణ కూడా పాల్గొన్నారు. భార్య ఇందిరకు ఆప్యాయంగా కేక్ తినిపించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ ఇందిరాదేవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కుమార్తె మంజుల, గల్లా జయదేవ్, మహేశ్ బాబు తనయుడు గౌతమ్, కుమార్తె సితార తదితరులు పాల్గొన్నారు. ఈ పుట్టినరోజు వేడుక ఫొటోలను మంజుల సోషల్ మీడియాలో పంచుకున్నారు.
.

More Telugu News