Andhra Pradesh: ఏపీలో జిల్లాల‌కు ఇంచార్జీ మంత్రులు వీరే

  • 25 మంది మ‌త్రుల‌కు 26 జిల్లాల బాధ్య‌త‌లు
  • గుడివాడ అమ‌ర్నాధ్‌కు రెండు జిల్లాల బాధ్య‌త‌లు
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం
this is the ap districts incherge ministers list

ఏపీలో 26 జిల్లాల‌కు ఇంచార్జీ మంత్రుల‌ను ప్ర‌క‌టిస్తూ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక్కో మంత్రికి ఒక్కో జిల్లాను కేటాయించిన జ‌గ‌న్‌.. ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌ను మాత్రం రెండు జిల్లాల‌కు ఇంచార్జీ మంత్రిగా నియ‌మించారు. అఅ్లూరి జిల్లాతో పాటుగా పార్వతీపురం జిల్లా ఇంచార్జీ మంత్రిగా అమ‌ర్నాథ్ కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

గుంటూరు-   ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు
కాకినాడ  -  సీదిరి అప్ప‌ల‌రాజు
శ్రీకాకుళం -  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
అన‌కాప‌ల్లి  - పీడిక రాజ‌న్న‌దొర‌
అల్లూరి, పార్వ‌తీపురం జిల్లాలు -  గుడివాడ అమ‌ర్నాథ్‌
విజ‌య‌న‌గ‌రం  - బూడి ముత్యాలనాయుడు
ప‌శ్చిమ గోదావ‌రి -   దాడిశెట్టి రాజా
ఏలూరు  -  పినిపే విశ్వ‌రూప్‌
క‌డ‌ప  -  ఆదిమూల‌పు సురేశ్‌
అన్న‌మ‌య్య జిల్లా -  కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి
స‌త్య‌సాయి జిల్లా - గుమ్మ‌నూరు జ‌య‌రాం
ప‌ల్నాడు - కారుమూరి నాగేశ్వ‌ర‌రావు
బాప‌ట్ల -  కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌
కోనసీమ  - జోగి ర‌మేశ్
ఒంగోలు  - మేరుగ నాగార్జున‌
విశాఖ -  విడ‌ద‌ల ర‌జిని
అనంత‌పురం - పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
కృష్ణా జిల్లా -  ఆర్కే రోజా
తిరుప‌తి  - నారాయ‌ణ స్వామి
నంద్యాల - అంజాద్ బాషా
క‌ర్నూలు  - బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి
చిత్తూరు  - ఉషశ్రీ చ‌ర‌ణ్‌
తూర్పు గోదావ‌రి -  చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ‌
ఎన్టీఆర్ జిల్లా -  తానేటి వ‌నిత‌
నెల్లూరు -  అంబ‌టి రాంబాబు

More Telugu News