Gavaskar: ఆ ఒక్క లోపాన్ని సవరించుకుంటే ఉమ్రాన్ అత్యంత ప్రమాదకారి అవుతాడు: గవాస్కర్

  • సన్ రైజర్స్ తరఫున ప్రకంపనలు సృష్టిస్తున్న ఉమ్రాన్
  • 150 కిమీ వేగంతో వేస్తున్న బంతులు
  • పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో వికెట్ల పంట
  • లెగ్ సైడ్ వైడ్లు తగ్గించుకోవాలన్న గవాస్కర్
  • వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తే తిరుగుండదని వ్యాఖ్య 
Gavaskar lauds Umran Malik

తాజా ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. గంటకు 150 కిమీ వేగంతో బంతులు వేస్తున్న ఉమ్రాన్ మాలిక్ క్రమంగా పదునెక్కుతున్నాడు. అందుకు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అతడి ప్రదర్శనే నిదర్శనం. 

ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ఉమ్రాన్ మాలిక్ ఎంతో ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, ఒక్కోసారి అధికంగా వైడ్ బాల్స్ వేస్తున్నాడని అన్నారు. ఆ ఒక్క లోపాన్ని సవరించుకుంటే ఉమ్రాన్ మాలిక్ ఎంతో గొప్ప ఫాస్ట్ బౌలర్ గా తయారవుతాడని అభిప్రాయపడ్డారు.

అతడి బంతుల్లోని వేగాన్ని ఎదుర్కోవడం ఏ బ్యాట్స్ మన్ కైనా తేలిక కాదని, అయితే లెగ్ సైడ్ వైడ్లు వేయడాన్ని అదుపు చేసుకోవాలని సూచించారు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తే ఉమ్రాన్ అంతటి ప్రమాదకర బౌలర్ మరొకరు ఉండరని గవాస్కర్ స్పష్టం చేశారు. తన లోపాన్ని సవరించుకుంటే  ఉమ్రాన్ మాలిక్ టీమిండియాకు ఎంపికవడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపారు.

More Telugu News