Chiranjeevi: 'ఆచార్య' వదిలిన అస్త్రంలా దూసుకుపోతున్న బంజారా సాంగ్!

  • 'ఆచార్య'గా చిరంజీవి 
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ 
  • బంజారా సాంగ్ ను ఆలపించిన శంకర్ మహదేవన్
  • ఈ నెల 29వ తేదీన సినిమా రిలీజ్    
Acharya movie update

చిరంజీవి - చరణ్ కథానాయకులుగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందింది. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, చరణ్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో  రీసెంట్ గా ఈ సినిమా నుంచి మరో సింగిల్ వదిలారు.

'భలే భలే బంజారా' అంటూ సాగే ఈ పాటను .. కథలో నక్సలైట్లు నైట్ ఎఫెక్టుతో పాడుకుంటారు. చిరంజీవి  .. చరణ్ తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటను వదిలిన 14 గంటల్లోనే 38 లక్షలకి పైగా వ్యూస్ .. 2 లక్షలకి పైగా  లైక్స్ వచ్చాయి. ఇంకా అదే జోరుతో ఈ పాట అలా దూసుకుపోతూనే ఉంది.

మణిశర్మ పాటల్లో డ్రమ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలా ఈ పాట డ్రమ్స్ తోనే మొదలవుతుంది .. ఊపుతో ఉత్సాహంగా కొనసాగుతుంది. రామజోగయ్య శాస్త్రి  సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శంకర్ మహదేవన్ .. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. చూస్తుంటే ఈ సినిమాను మణిశర్మ మ్యూజికల్ హిట్ లా నిలబెట్టేలానే ఉన్నాడు.

More Telugu News