AP High Court: ఎయిడెడ్ ఉపాధ్యాయుల‌కు త‌క్ష‌ణ‌మే వేత‌నాలివ్వండి... ఏపీ స‌ర్కారుకు హైకోర్టు ఆదేశం

  • 8 నెల‌లుగా తమకు జీతాలు లేవంటూ హైకోర్టుకు వెళ్లిన ఎయిడెడ్ ఉపాధ్యాయులు  
  • జీతాలు లేక ఇబ్బందులు ప‌డుతున్నామంటూ హైకోర్టుకు మొర 
  • వేత‌నాలు విడుద‌ల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు
ap high court orders to ap government

ఏపీలోని ఎయిడెడ్ విద్యా సంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న ఉపాధ్యాయుల‌కు త‌క్ష‌ణ‌మే వేత‌నాలు విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు ఎయిడెడ్ ఉపాధ్యాయులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు సోమ‌వారం నాడు ప్ర‌భుత్వానికి ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఏపీలోని ఎయిడెడ్ విద్యా సంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న త‌మ‌ను 8 నెల‌ల క్రిత‌మే ప్ర‌భుత్వ ప‌రిధిలోకి తీసుకున్నప్ప‌టికీ...వేత‌నాల‌ను మాత్రం 8 నెల‌ల నుంచి విడుద‌ల చేయ‌డం లేద‌ని ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై సోమ‌వారం హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌గా... 8 నెల‌లుగా వేత‌నాలు లేని కార‌ణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ఉపాధ్యాయులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎయిడెడ్ ఉపాధ్యాయుల‌కు త‌క్ష‌ణ‌మే వేత‌నాలు విడుద‌ల చేయాల‌ని హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News