Ntr: ఎన్టీఆర్ కోసం అలాంటి కథనే రాశాను: కొరటాల

  • ఎన్టీఆర్ కోసం మంచి కథను రాశానన్న కొరటాల  
  • ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడి 
  • జూన్ నుంచి షూటింగ్ మొదలవుతుందని వ్యాఖ్య 
  • అందరికీ నచ్చుతుందన్న కొరటాల
 Ntr in Kortala Movie

కొరటాల రచయితగానే ఇండస్ట్రీకి వచ్చారు. రచయితగా ఆయన పనిచేసిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. ఆ తరువాతనే ఆయన మెగాఫోన్ పట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇంతవరకూ ఆయన ఫ్లాప్ అనే మాటను వినకపోవడం విశేషం.    

ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఆచార్య' ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నారు. 'ఆచార్య' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా ప్రస్తావన రాగా ఆయన స్పందిస్తూ, "ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ నుంచి షూటింగు మొదలవుతుంది.

నాకు పాన్ ఇండియా అనే పదమే నచ్చదు. పాన్ ఇండియా కోసం ఒకలా ..  అలా కాకపోతే మరోలా కథలు రాయను.  బలమైన కథాకథనాలతో రాస్తే అందరూ తప్పకుండా చూస్తారు .. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అలాంటి ఓ మంచి కథనే ఎన్టీఆర్ కోసం రాశాను. 'ఆచార్య' రిలీజ్ తరువాత ఎన్టీఆర్  సినిమాకి సంబంధించిన పూర్తి విషయాలు మాట్లాడతాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News