Samantha: టాటూలు వేయించుకోవద్దు.. ఆ ఆలోచన కూడా మానుకోండి: సమంత

  • ఇటీవల అభిమానులతో చిట్ చాట్ చేసిన సమంత
  • తన తొలి సంపాదన రూ. 500 అని వెల్లడించిన సామ్
  • అందరూ స్వశక్తిపై నమ్మకం పెట్టుకోవాలని సూచన
Samantha suggests not to have tatoos

దక్షిణాది అందాల భామ సమంత ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తన మకాంను ముంబైకి మార్చే పనిలో సమంత ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో సమంత ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తన కెరీర్ కు సంబంధించిన వివరాలతో పాటు, వ్యక్తిగత విషయాలను సైతం ఆమె అభిమానులతో పంచుకుంటుంటుంది. ఇటీవల తన అభిమానులతో ఆమె చిట్ చాట్ జరిపింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. 

తాను చూసిన ఫస్ట్ మూవీ 'జురాసిక్ పార్క్' అని సమంత తెలిపింది. ఓ హోటల్ లో తాను హోస్టెస్ గా పని చేశానని... ఎనిమిది గంటలు పని చేసి రూ. 500 అందుకున్నానని... అదే తన తొలి సంపాదన అని చెప్పింది. తాను టాటూలు వేయించుకోకూడదని అనుకున్నానని... కానీ ఆ తర్వాత వేయించుకున్నానని తెలిపింది. టాటూల ఎవరూ వేయించుకోవద్దని, ఆ ఆలోచన కూడా మానుకోవాలని సూచించింది. 

సమంత నడుము పైభాగంలో తన మాజీ భర్త నాగచైతన్య పేరు 'చై' అనే టాటూ ఉన్న సంగతి తెలిసిందే. వీపుపై, కుడి చేతిపై మరో రెండు టాటూలు ఉన్నాయి. అందరూ స్వశక్తిపై నమ్మకం పెట్టుకోవాలని, కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పింది.

More Telugu News