Pakistan: అప్పుడు విమర్శలు.. ఇప్పుడు పొగడ్తలు.. భారత్ కు వ్యతిరేకం కాదన్న ఇమ్రాన్ ఖాన్

  • అమెరికా, యూరప్ కూ వ్యతిరేకం కాదని వెల్లడి
  • మానవతా వాదినన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని
  • ప్రధాని పదవి పోయాక బల ప్రదర్శన కోసం కరాచీలో సభ
Imran U Turn Over His Foreign Conspiracy Comments

తాను ఏ దేశానికీ వ్యతిరేకం కాదని పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తనను దించేయడం వెనుక విదేశీ కుట్ర ఉందని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయాక తన బలాన్ని చూపించుకునేందుకు నిన్న కరాచీలో బహిరంగసభ ఏర్పాటు చేశారు.  ఆ సభలో మాట్లాడిన ఆయన.. తాను భారత్ కు గానీ, అమెరికాకు, యూరప్ కు గానీ వ్యతిరేకం కాదని చెప్పారు. 

తాను మానవతావాదినన్నారు. తాను ఏ దేశానికీ, ఏ మతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాగా, ప్రధాని పదవిలో ఉన్నప్పుడు భారత్ పై తరచూ విమర్శలు గుప్పించిన ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు పొగడడం మొదలు పెట్టారు. భారతీయులకు ఆత్మగౌరవం ఎక్కువంటూ అవిశ్వాస తీర్మానానికి ఒక్కరోజు ముందు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. భారత విదేశాంగ విధానాలు స్వతంత్రంగా ఉంటాయని, ప్రజల మేలును దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారని అన్నారు.

More Telugu News