Ashish: ధనుశ్ క్లాప్ తో మొదలైన దిల్ రాజు మూవీ 'సెల్ఫిష్'

  • 'రౌడీబాయ్స్'తో పరిచయమైన ఆశిష్
  • హీరోగా రెండో సినిమా మొదలు 
  •  ఆసక్తిని రేపుతున్న టైటిల్ పోస్టర్
  • దర్శకుడిగా కాశీ విశాల్ పరిచయం    
Selfish Movie title poster released

ఈ మధ్య కాలంలో బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా ఆశిష్ కనిపిస్తాడు. తను దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు. ఇటీవలే 'రౌడీ బోయ్స్' సినిమాతో ఆశిష్ తెలుగు తెరకి పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు రెండో సినిమాను ప్రారంభించారు.

ఈ రోజునే ఈ సినిమాను లాంచ్ చేశారు. ధనుశ్ క్లాప్ తో ఈ సినిమా షూటింగు మొదలైంది. ఈ సినిమాకి 'సెల్ఫిష్' అనే టైటిల్ ను ఖరారు చేసి, తాజాగా టైటిల్ పోస్టర్ ను వదిలారు. ఊరమాస్ లుక్ తో ఈ పోస్టర్లో ఆశిష్ కనిపిస్తున్నాడు. యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ మద్దతును మూటగట్టే పనిలోనే ఆశిష్ ఉన్నాడనే విషయం అర్థమవుతోంది. 

దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ ఒక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఇంతకుముందు ఎంతోమంది కొత్త దర్శకులను దిల్ రాజు పరిచయం చేశారు. ఈ సినిమాతో కాశీ విశాల్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More Telugu News