Russia: ఏ క్షిపణితో తమ నౌకను ధ్వంసం చేశారో ఆ క్షిపణి ఫ్యాక్టరీనే నాశనం చేసిన రష్యా

  • రష్యా యుద్ధనౌకను ధ్వంసం చేసిన ఉక్రెయిన్
  • నెప్ట్యూన్ క్షిపణితో మాస్క్వా యుద్ధనౌకపై దాడి
  • రష్యా ప్రతీకార చర్యలు
  • కీవ్ లో నెప్ట్యూన్ క్షిపణి తయారీ కేంద్రం
  • రెండువారాల తర్వాత కీవ్ లో మళ్లీ పేలుళ్ల మోత
Russia reportedly blasts Neptune missile factory in Kyiv

రష్యా ప్రతీకార ధోరణి మరోసారి వెల్లడైంది. ఉక్రెయిన్ బలగాలు రష్యాకు చెందిన మాస్క్వా యుద్ధ నౌకను ధ్వంసం చేయడం తెలిసిందే. ఉక్రెయిన్ ప్రయోగించిన నెప్ట్యూన్ క్షిపణి రష్యా యుద్ధనౌకను తుత్తునియలు చేసింది. తన అమ్ములపొదిలో శత్రుభీకర యుద్ధనౌకగా పేరుగాంచిన మాస్క్వాను ఉక్రెయిన్ ఓ క్షిపణితో ధ్వంసం చేయడాన్ని రష్యా భరించలేకపోయింది. 

కొన్నిరోజుల వ్యవధిలో తన ప్రతీకారం ఏ స్థాయిలో ఉంటుందో ఉక్రెయిన్ కు రుచిచూపింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని నెప్ట్యూన్ క్షిపణులు తయారీ, మరమ్మతుల కర్మాగారంపై బాంబుల వర్షం కురిపించింది. ఇటీవలే కీవ్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయి. అయితే మాస్క్వా యుద్ధనౌక పేలుడు కారణంగా మునిగిపోయిన అనంతరం, కీవ్ లో భారీ విస్ఫోటనాలు వినిపించాయి. దీనిపై రష్యా ప్రభుత్వం ప్రకటన చేసింది. 

కీవ్ లోని యాంటీ షిప్ మిస్సైళ్ల తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పేర్కొంది. రష్యా ఆయుధ సంపత్తిపైనా, రష్యా భూభాగంపైనా జరిగే ఏ ఉగ్రదాడిని, విధ్వంసాన్ని సహించబోమని, కీవ్ పై మరిన్ని మిస్సైల్ దాడులు చేస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

More Telugu News