Prabhas: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పోటీ ఉందా? అనే ప్రశ్నకు ప్రభాస్ సమాధానం ఇదే!

  • పాన్ ఇండియా సినిమాల వల్ల పోటీ పెరిగిందని భావించడం లేదన్న ప్రభాస్ 
  • అందరం కలిసి మరిన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తే బాగుంటుందని ఆకాంక్ష 
  • రాజమౌళి ఇప్పుడు భారతీయ దర్శకుడని కితాబు 
Prabhas answer to the question of competition with Junior NTR and Ramcharan

దక్షిణాది సినీ పరిశ్రమ ఇటీవలి కాలంలో పాన్ ఇండియా రేంజ్ పై దృష్టి సారించింది. దక్షిణాది అగ్ర హీరోలు పాన్ ఇండియా సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కన్నడ హీరో యశ్, తమిళ్ స్టార్ విజయ్ తదితరులు తమదైన ముద్రను వేశారు. మరోవైపు ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తారక్, చరణ్, యశ్ తదితరుల వల్ల పాన్ ఇండియా స్థాయిలో పోటీ పెరిగిందని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు బదులుగా ప్రభాస్ స్పందిస్తూ... పాన్ ఇండియా సినిమాలు విజయం సాధించడం వల్ల తనకు పోటీ పెరిగిందని భావించడం లేదని అన్నాడు. అందరం కలిసి మరిన్ని పాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తే బాగుంటుందని చెప్పాడు.

'ఆర్ఆర్ఆర్' సినిమాను చూశానని, ఆ సినిమా తనకు ఎంతో నచ్చిందని అన్నాడు. రాజమౌళి ఇప్పుడు దక్షిణాది దర్శకుడు కాదని, భారతీయ దర్శకుడని కితాబునిచ్చాడు. 'కేజీఎఫ్ 2' బ్లాక్ బస్టర్ కావడం... ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ వంటి పెద్ద డైరెక్టర్ తో నటించబోతుండటం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు.

More Telugu News