WhatsApp: వాట్సాప్ లో ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లు

  • 2 జీబీ వరకు ఫైల్ షేరింగ్
  • ఒకేసారి 32 మందికి వాయిస్ కాల్
  • గ్రూప్ కాల్ లో 8 మందితో మాట్లాడొచ్చు
  • గ్రూపు అడ్మిన్లకు మెస్సేజ్ డిలీషన్ అధికారం
WhatsApp announces Communities 4 new features for groups

వాట్సాప్ లో కొత్త సదుపాయం ఏది వచ్చినా మెజారిటీ భారతీయులకు అది సౌకర్యాన్నిస్తుంది. ఎందుకంటే భారత్ నుంచి 49 కోట్ల మంది వాట్సాప్ కు యూజర్లుగా ఉన్నారు. వాట్సాప్ కు అతిపెద్ద మార్కెట్ మన దేశమే. ఫేస్ బుక్ కు చెందిన ఈ సంస్థ పలు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది.

వాట్సాప్ లో ఒకేసారి ఒక జీబీ వరకు డేటాను పంపించుకునేందుకు అనుమతి ఉంది. ఇక మీదట 2జీబీ ఫైల్స్ ను కూడా పంపుకోవచ్చు. ఇప్పటివరకు వాట్సాప్ లో గ్రూప్ కాల్స్ కింద ఒకేసారి నలుగురు కలసి మాట్లాడుకోవచ్చు. ఇకపై 8 మంది కూడా ఒకేసారి కనెక్ట్ అయి మాట్లాడుకోవడానికి వీలుంటుంది. అలాగే, వాయిస్ కాల్ ను ఒకేసారి 32 మందికి చేసిన మాట్లాడుకోవచ్చు. 

వాట్సాప్ గ్రూపు అడ్మిన్ లు ఇబ్బందికరం అనిపించిన మెస్సేజ్ లను ప్రతి ఒక్కరి చాట్ నుంచి, ఎప్పుడైనా డిలీట్ చేసే సౌకర్యం ఉంటుంది. ఎమోజీ రియాక్షన్స్ తో తమ భావాన్ని వ్యక్తీకరించుకునే ఫీచర్ కూడా రానుంది. కొత్త ఫీచర్లను అతి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.

More Telugu News