Hyderabad: హైద‌రాబాద్‌లో హిజాబ్ వివాదం.. పోలీసుల లాఠీచార్జీలో ప‌లువురికి గాయాలు

  • హిజాబ్‌తో స్కూల్‌కు రావ‌ద్ద‌న్న పాఠ‌శాల యాజ‌మాన్యం
  • పాఠ‌శాల యాజ‌మాన్యంతో విద్యార్థిని పేరెంట్స్ వాగ్వివాదం
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన పాఠశాల మేనేజ్‌మెంట్‌
  • పోలీసుల లాఠీచార్జీలో ప‌లువురికి గాయాలు
hijab row in hyderabad

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో హిజాబ్ వివాదం తలెత్తింది. ఇటీవ‌లే క‌ర్ణాట‌క‌లో రేగిన వివాదం మాదిరే హైద‌రాబాద్‌లోనూ బుధ‌వారం నాడు హిజాబ్ వివాదం కలకలం రేపింది. న‌గ‌రంలోని బ‌హ‌దూర్‌పురాకు చెందిన గౌత‌మి స్కూల్ ఈ వివాదానికి వేదిక‌గా నిలిచింది. పాఠశాల‌కు హిజాబ్‌తో వ‌చ్చిన ఓ విద్యార్థినిని అలా రావ‌ద్ద‌ని చెప్పినందుకు విద్యార్థిని త‌ల్లిదండ్రులు బుధ‌వారం స్కూల్ యాజ‌మాన్యంతో వాగ్వివాదానికి దిగారు. దీనిపై పాఠ‌శాల యాజమాన్యం నేరుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 

స‌మాచారం అందుకున్న వెంట‌నే పాఠ‌శాల వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు విద్యార్థిని త‌ల్లిదండ్రుల‌కు స‌ర్ది చెప్పే య‌త్నం చేశారు. అయితే ఎంత‌కీ వారు విన‌క‌పోవ‌డం, క్ర‌మంగా పాఠ‌శాల‌కు వ‌స్తున్న వారి సంఖ్య‌ను చూసిన పోలీసులు... ప‌రిస్థితి అదుపు త‌ప్పుతోంద‌ని భావించి లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో ప‌లువురికి గాయాల‌య్యాయి.

More Telugu News