Priyanka Chopra: ఉక్రెయిన్ ను ఆదుకుందాం... ప్రపంచనేతలకు పిలుపునిచ్చిన ప్రియాంక చోప్రా

  • ఉక్రెయిన్ లో రష్యా దాడులు
  • ఉక్రెయిన్ లో అత్యంత దయనీయ పరిస్థితులు
  • శరణార్థులుగా లక్షల మంది
  • చిన్నారుల పరిస్థితిపై చలించిపోయిన ప్రియాంక చోప్రా
Priyanka Chopra calls for solidarity acts towards Ukraine

ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో, శరణార్థుల పరిస్థితిపై ప్రముఖ నటి ప్రియాంక చోప్రా స్పందించారు. యునిసెఫ్ సౌహార్ద్ర రాయబారి హోదాలో ఆమె అంతర్జాతీయ నేతలకు పిలుపునిచ్చారు. 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ స్థాయిలో పిల్లలు చెల్లాచెదురవుతున్నారని, ఉక్రెయిన్ శరణార్థులను ఆదుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. 'ప్రపంచ నాయకులారా... మనం ఇక ఎంతమాత్రం చూస్తూ ఊరుకోలేం. శరణార్థులకు అండగా నిలిచి, వారికి అవసరమైన సహాయం చేయడానికి ముందుకు వస్తారా...' అంటూ ప్రియాంక చోప్రా ఓ వీడియో సందేశం వెలువరించారు. ఈ మేరకు ప్రపంచస్థాయిలో విరాళాల కోసం అభ్యర్థన చేశారు. అంతేకాదు, స్పందించే దాతల కోసం యునిసెఫ్ విరాళాల లింక్ ను కూడా పొందుపరిచారు. 

ఉక్రెయిన్ లో ప్రస్తుతం అత్యంత దయనీయ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. రష్యా సేనల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఒకెత్తయితే... ఆకలి, నిత్యావసరాల లేమి, పొరుగుదేశాలకు వలస బాట, ఆపై శరణార్థుల సమస్యలు మరో ఎత్తుగా కనిపిస్తున్నాయి.

More Telugu News