Balakrishna: సీనియర్ నటుడు బాలయ్యగారి మృతి న‌న్ను క‌ల‌చివేసింది: నంద‌మూరి బాల‌కృష్ణ‌

  • బాల‌య్య గొప్ప‌ న‌టుడన్న బాలకృష్ణ 
  • మా తండ్రి ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించారని వెల్లడి 
  • నా సినిమాల్లో కూడా మంచి పాత్ర‌లు పోషించారని వివరణ 
  • బాల‌య్య‌తో త‌మ కుటుంబానికి మంచి అనుబంధం ఉంద‌న్న బాలకృష్ణ‌
balakrishna expresses condolences

ప్రముఖ నటుడు బాలయ్య (94) హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల సినీ న‌టుడు, ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ సంతాపం వ్య‌క్తం చేస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బాల‌య్యగారి మ‌ర‌ణ‌వార్త తన‌ను క‌లచివేసిందని చెప్పారు. బాల‌య్య గొప్ప‌ న‌టుడ‌ని, త‌న తండ్రి ఎన్టీఆర్‌తో క‌లిసి ఆయన న‌టించారని బాల‌కృష్ణ పేర్కొన్నారు. 

త‌న సినిమాల్లో కూడా మంచి పాత్ర‌లు పోషించారని అన్నారు. మంచి న‌టుడు, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, క‌థా ర‌చ‌యిత‌గా బాల‌య్య ప్రతిభ‌ చూపారని చెప్పారు. బాల‌య్య‌తో త‌మ‌ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయ‌న నేడు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం ఎంతో దుర‌దృష్ట‌క‌రమ‌ని బాల‌కృష్ణ చెప్పారు. బాల‌య్య‌ ప‌విత్ర ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. బాల‌య్య‌ కుటుంబ సభ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నానని పేర్కొన్నారు. 

More Telugu News