Cricketer: మహిళా క్రికెటర్ ఇంటిని కూల్చివేసిన జీహెచ్ఎంసీ.. డిప్యూటీ స్పీకర్ కొడుకే కారణమని బాధితురాలి ఆవేదన!

  • ఇల్లు కూలిపోయే అవకాశం ఉందని గతంలో నోటీసులిచ్చిన జీహెచ్ఎంసీ
  • ఇంటికి మరమ్మతులు చేయించామన్న క్రికెటర్ శ్రావణి
  • డిప్యూటీ స్పీకర్ పద్మారావు కొడుకు హస్తం ఉందని ఆరోపణ
GHMC dismantled Cricketer Sravani house

మహిళా క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని ఈ ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేశారు. హైదరాబాదులోని తుకారాంగేట్ పరిధిలో శ్రావణి ఇల్లు ఉంది. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ, ఇల్లు కూలిపోయే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారని, దీంతో ఇంటికి తాము మరమ్మతులు చేయించామని తెలిపారు. అయినప్పటికీ, తమ ఇంటిని పరిశీలించకుండా కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోని వస్తువులను బయట పడేసి కూల్చి వేశారని అన్నారు. 

ఈ ఘటన వెనుక తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కొడుకు రామేశ్వర్ గౌడ్ హస్తం ఉందని శ్రావణి ఆరోపించారు. పద్మారావు కార్యాలయానికి పిలిపించి రామేశ్వర్ తమను బెదిరించాడని, రూ. 2 లక్షలు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని అన్నాడని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేయడం దారుణమని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ ఆడాలో? లేక ఇంటి కోసం పోరాడాలో? అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

More Telugu News