Allu Arjun: ఈ ల్యాండ్ మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో బ‌న్నీ: చిరు

  • నేడు అల్లు అర్జున్ 40వ‌ పుట్టిన‌రోజు 
  • బ‌న్నీకి చిరంజీవి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు 
  • పట్టుదల, కష్టపడేతత్వమే బ‌న్నీకి విజయాలు వరించేలా చేస్తోందని ట్వీట్
 Chiranjeevi wishes Allu arjun

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ఈ రోజు 40వ‌ పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా బ‌న్నీకి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.
 
'జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్ మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో' అని చిరంజీవి పేర్కొన్నారు. మ‌రోవైపు, అల్లు అర్జున్ త‌న జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి భార్య, పిల్లలతో క‌లిసి సెర్బియాకు వెళ్లినట్లు తెలిసింది.

More Telugu News