Sensex: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 575 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 168 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా నష్టపోయిన టైటాన్ షేరు విలువ
Markets end in losses for strait third day

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో... ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 575 పాయింట్లు నష్టపోయి 59,034కి పడిపోయింది. నిఫ్టీ 168 పాయింట్లు కోల్పోయి 17,639కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (2.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.12%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.88%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.87%). 

టాప్ లూజర్స్:
టైటాన్ (-3.24%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.91%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.19%), విప్రో (-2.13%), టీసీఎస్ (-1.90%).

More Telugu News