Vijay: విజయ్, రష్మికలపై క్లాప్ కొట్టేసిన దిల్ రాజు!

  • దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి మూవీ
  • విజయ్ సరసన నాయికగా రష్మిక
  • సంగీత దర్శకుడిగా తమన్
  • తెలుగు .. తమిళ భాషల్లో నిర్మాణం  
Vamshi Paidipalli movie update

తమిళ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాకి కథానాయికగా రష్మికను ఎంపిక చేసుకున్నట్టు ఇటీవలనే ప్రకటించారు. 

ఇక ఈ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. విజయ్ - రష్మికలపై దిల్ రాజు క్లాప్ ఇవ్వడంతో ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. విజయ్ తాజా చిత్రంగా రూపొందిన 'బీస్ట్' ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఆ సినిమా థియేటర్లకి రావడానికి వారం రోజుల ముందుగా, వంశీ పైడిపల్లి సినిమా పట్టాలెక్కడం విశేషం.

 కెరియర్ పరంగా విజయ్ కి ఇది 66వ సినిమా. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'మహర్షి' తరువాత వంశీ పైడిపల్లి - దిల్ రాజు కాంబినేషన్లో నిర్మితమవుతున్న ఈ సినిమాతో, కోలీవుడ్ లోను రష్మిక జెండా ఎగరేసే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News