Beast: విజయ్ రౌద్రావతారం... 'బీస్ట్' తెలుగు ట్రైలర్ ఇదిగో!

  • విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్
  • విజయ్ సరసన పూజా హెగ్డే 
  • నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చిత్రం
  • ఈ నెల 13న రిలీజ్
Vijay Beast Telugu version Trailer out now

తమిళ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్ రిలీజైంది. భారత గూఢచారి వీర రాఘవగా విజయ్ విశ్వరూపం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. సన్ పిక్చర్స్ పతాకంపై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అత్యంత భారీతనంతో 'బీస్ట్' రూపుదిద్దుకుంది. ఇందులో స్పై పాత్రలో విజయ్ చేసే సాహసాలు ప్రేక్షకులకు కొత్త థ్రిల్ కలిగిస్తాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయిక. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. 'బీస్ట్' చిత్రం ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సెల్వరాఘవన్, యోగి బాబు, రెడిన్ కింగ్స్ లే, బార్న్ సరావో తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

More Telugu News