Andhra Pradesh: వీధి ఒకటే.. నియోజకవర్గాలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు.. ఏపీలో వింత!

  • నిన్నటి నుంచి ఏపీలో కొత్త జిల్లాల అమలు
  • 13 జిల్లాల నుంచి 26 జిల్లాలుగా మారిన ఏపీ
  • వీధిలో ఒక భాగం తూర్పుగోదావరి, రెండో భాగం ఏలూరు జిల్లాలోకి
One street in two separate districts in andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చిన కొత్త జిల్లాల్లో పలు వింతలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో నిన్నటి నుంచి అధికారికంగా 26 జిల్లాలు అమల్లోకి రాగా, ఒకే వీధి ఇప్పుడు రెండు నియోజకవర్గాలు, రెండు మండలాలు, రెండు జిల్లాలకు సరిహద్దుగా మారింది. జిల్లాల పునర్విభజన కారణంగా కొవ్వూరు నియోజక వర్గం తాళ్లపూడి మండలంలోని తాడిపూడి, పోలవరం నియోజక వర్గం గూటాల పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మీదేవిపేట గ్రామాలు వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. 

తాడిపూడిలోని ఓ వీధి కుడివైపు భాగం తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లగా, ఎడమవైపున ఉన్న మహాలక్ష్మీదేవిపేట ఏలూరు జిల్లాలోకి వెళ్లింది. ఫలితంగా ఒకే వీధి ప్రజలు రెండు వేర్వేరు జిల్లాలు, వేర్వేరు మండలాలు, వేర్వేరు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు అయింది.

More Telugu News