Corona Virus: వేగంగా వ్యాప్తి చెందుతున్న ‘ఎక్స్ఈ’ వేరియంట్.. మాస్కులు తీయొద్దని హెచ్చరిక

  • బీఏ.1, బీఏ.2 మిశ్రమ వేరియంటే ‘ఎక్స్ఈ’
  • బీఏ.2 కంటే పది రెట్లు వేగంగా వ్యాప్తి
  • మాస్కులు తీసే సమయం ఇంకా రాలేదంటున్న నిపుణులు
  • కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచన
XE Variant Infects 10 times faster than BA2

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని సంబరపడుతున్న వేళ పుట్టుకొచ్చిన ఒమిక్రాన్‌లోని మరో వేరియంట్ అయిన ‘ఎక్స్ఈ’ ఇప్పుడు జనాన్ని భయపెడుతోంది. దీనికి వేగంగా వ్యాప్తిచెందే లక్షణం ఉండడంతో నిపుణులు అప్రమత్తమయ్యారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అయిన ‘బీఏ.1, బీఏ.2’ల మిశ్రమ వేరియంటే ఎక్స్ఈ. బీఏ.2 కంటే ఇది 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు.

 ఈ నేపథ్యంలో మాస్కుల వినియోగంపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తున్నారు. మాస్కులు తీసే సమయం ముందు ఉందని, ఇప్పటికైతే వాటిని ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ‘ఎక్స్ఈ’ వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది.


ప్రపంచవ్యాప్తంగా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోనూ మళ్లీ అది విజృంభించే అవకాశాన్ని కొట్టిపడేయలేమని, కాబట్టి కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించనంత వరకు కొవిడ్ నిబంధనలను కొనసాగించాలని ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ కొత్త వేరియంట్ వల్ల మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 600 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెబుతున్నారు.

More Telugu News