BJYM: డ్రగ్స్ కేసులో పలుకుబడి ఉన్నవాళ్ల పేర్లు తొలగిస్తున్నారు... డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు

  • పుడింగ్ అండ్ మింక్ పబ్ పై పోలీసుల దాడులు
  • అనేకమందిని అదుపులోకి తీసుకుని వదిలేసిన వైనం
  • డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లే యత్నం చేసిన యువ మోర్చా 
BJYM cadre protests at DGP office in Hyderabad

హైదరాబాదులో ఓ పబ్ పై పోలీసులు దాడి చేసిన ఘటనపై బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. డ్రగ్స్ కేసులో పలుకుబడి ఉన్నవాళ్ల పేర్లు తొలగిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బంజారాహిల్స్ పబ్ లో దొరికిన అందరినీ కఠినంగా శిక్షించాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా బీజేవైఎం శ్రేణులు లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. బీజేవైఎం కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఓ దశలో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి నాంపల్లి పీఎస్ కు తరలించారు.

More Telugu News