Cricket: సన్ రైజర్స్ హైదరాబాద్ నిరసన.. బీసీసీఐకి లేఖ రాసిన వైనం

  • ఫస్ట్ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ ఔట్ పై దుమారం
  • వీడియోలు, ఫొటోలను బీసీసీఐకి పంపిన జట్టు
  • చర్యలు తీసుకోవాలని కోరిన జట్టు యాజమాన్యం
SRH Expresses Anguish Over Kane Caught Out Writes to BCCI

ఈ ఐపీఎల్ సీజన్ ను  సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు ఓటమితో ప్రారంభించింది. అయితే, ఆ మ్యాచ్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్యాచ్ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై ఎస్ఆర్ హెచ్ తాజాగా నిరసనకు దిగింది. అంపైర్ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఫర్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కి లేఖ రాసింది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ టామ్ మూడీ ఖరారు చేశారు. 

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 61 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ లో కేన్ విలియమ్సన్  క్యాచ్ అవుట్ అయ్యాడు. రీప్లేలో బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. థర్డ్ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించాడు. దీన్ని ఎస్ఆర్ హెచ్ ఖండించింది. అది అవుట్ కాదని వాదిస్తోంది. 

దీనిపైనే తాజాగా ఆ క్యాచ్ అవుట్ కు సంబంధించిన వీడియోను, వివిధ కోణాల్లో తీసిన ఫొటోలను లేఖకు జత చేస్తూ బీసీసీఐకి పంపింది. అది అవుట్ కాదని, భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

More Telugu News