Ram: మాస్ యాక్షన్ మామూలుగా ఉండదంటున్న రామ్!

  • రామ్ తాజా చిత్రంగా 'ది వారియర్'
  • కథానాయికగా కృతి శెట్టి 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్
  • జూలై 14న తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్        
The Worrierr Movie Special Poster

మాస్ హీరోగా ముందుకు వెళ్లడానికే రామ్ ఎక్కువ ఆసక్తిని చూపుతున్నాడు. అలాగే తనని ఇంతవరకూ ప్రేక్షకులు చూడని కొత్త లుక్ తో కనిపించాలని అనుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసిన సినిమానే 'ది వారియర్'. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ రోజున 'ఉగాది' పండుగ కావడంతో ఈ సినిమా టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక కొత్త పోస్టర్ ను వదిలారు. బుల్లెట్ పై పోలీస్ ఆఫీసర్ గా సీరియస్ లుక్ తో రామ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఆయన లుక్ చూస్తుంటేనే ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుందనే విషయం అర్థమవుతోంది.

రామ్ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జూలై 14వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత బోయపాటితో కలిసి రామ్ సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.

More Telugu News