Kalyanram: 'బింబిసార' రిలీజ్ డేట్ ప్రకటన రేపే!

  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్
  • చారిత్రక నేపథ్యంలో సాగే కథ 
  • సొంత బ్యానర్లో నిర్మించిన చిత్రం 
  • కథనాయికలుగా కేథరిన్ - సంయుక్త
Bimbisara movie update

హీరోగాను .. నిర్మాతగాను కొత్త ప్రయోగాలతో కల్యాణ్ రామ్ ముందుకు వెళుతున్నాడు. తన సొంత బ్యానర్ పై ఆయన 'బింబిసార' సినిమాను నిర్మించాడు. ఈ కథ గతంలోనూ .. వర్తమానంలోను నడుస్తూ ఉంటుందని అంటున్నారు. అందువలన కల్యాణ్ రామ్ రాజుగానే కాకుండా, మోడ్రన్ లుక్ తోను కనిపించనున్నాడని చెబుతున్నారు.

కీరవాణి - చిరంతన్ భట్ కలిసి పనిచేసిన ఈ సినిమాకి, వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా కేథరిన్ .. సంయుక్త మీనన్ కనిపించనున్నారు. ఈ సినిమా కొంతకాలం క్రితమే పూర్తయినప్పటికీ సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. 'ఉగాది' సందర్భంగా రేపు ఉదయం 11:34 నిమిషాలకు రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. 

ఇంతకుముందు కల్యాణ్ రామ్ చేసిన '118' హిట్ కొట్టగా, 'ఎంతమంచివాడవురా' ఫరవాలేదనిపించుకుంది. ఆ తరువాత కల్యాణ్ రామ్ చేసిన సినిమా ఇదే. తన కెరియర్లో తొలిసారిగా ఆయన చారిత్రక నేపథ్యాన్ని టచ్ చేశాడు.  ఆయన చేసిన ఈ ప్రయోగం ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.

More Telugu News