Chennai Super Kings: రాణించిన ఊతప్ప, దూబే, మొయిన్... చెన్నై భారీ స్కోరు

  • బ్రాబౌర్న్ స్టేడియంలో పరుగుల ప్రవాహం
  • భారీ షాట్లతో విరుచుకుపడిన చెన్నై బ్యాటర్లు
  • అర్ధసెంచరీ చేసిన ఊతప్ప
  • 49 పరుగులతో అదరగొట్టిన శివమ్ దూబే
  • 20 ఓవర్లలో చెన్నై స్కోరు 7 వికెట్లకు 210 పరుగులు
Chennai posts huge total against Lucknow Supergiants

ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ పరుగుల ప్రవాహం సృష్టించారు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. 

ఓపెనర్ రాబిన్ ఊతప్ప ఆరంభం నుంచి బ్యాట్ ఝుళిపించాడు. ఊతప్ప 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 50 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 1 పరుగుకే అవుట్ అయినా, వన్ డౌన్ లో వచ్చిన మొయిన్ అలీ కూడా ధాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. మొయిన్ అలీ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. 

ఇక మిడిలార్డర్ లో వచ్చిన యువ కెరటం శివమ్ దూబే 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. రాయుడు 27, కెప్టెన్ జడేజా 17, ధోనీ 16 పరుగులు నమోదు చేశారు. లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ 2, ఆండ్రూ టై 2, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశారు.

More Telugu News