Ratan Tata: టాటాకు భార‌త ర‌త్నఇవ్వాల‌ని పిటిష‌న్‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఢిల్లీ హైకోర్టు

  • పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ సామాజిక కార్య‌క‌ర్త రాకేశ్
  • కీల‌క ప్ర‌శ్న‌ల‌ను సంధించిన ఢిల్లీ హైకోర్టు
  • పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకున్న పిటిష‌న‌ర్‌
delhi high court fires on a petition seeking bharat ratna to ratan tata

టాటా స‌న్స్ మాజీ చైర్మ‌న్, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు భారత రత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖ‌లైన ఓ పిటిష‌న్‌పై ఢిల్లీ హైకోర్టులో అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. సామాజిక కార్యకర్త రాకేష్ దాఖ‌లు చేసిన ఈ పిటిష‌న్‌ను విచారించేందుకు ముందుగా నిరాక‌రించిన కోర్టు.. పిటిష‌న‌ర్ స‌రికొత్త వాద‌న‌లు వినిపించేస‌రికి తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఆపై పిటిష‌న్‌ను కొట్టేస్తానంటూ చెప్ప‌డంతో పిటిష‌న‌ర్ త‌న పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్‌కు కోర్టు ప‌లు కీల‌క ప్ర‌శ్న‌లు సంధించింది. 

 ఓ వ్యక్తికి దేశ అత్యున్నత అవార్డు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేయ‌గా.. ఓ వ్యక్తికి భారత రత్న ఇవ్వాలని కోర్టు ఆదేశాలిస్తుందా? అంటూ పిటిష‌న‌ర్‌ను నిల‌దీసింది. అయితే క‌నీసం ప్రభుత్వానికి విజ్ఞప్తి అయినా చేయాల‌ని పిటిష‌నర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన‌ తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్ విపిన్ సంఘీ.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయ‌డానికి కోర్టు ఎక్కడ జోక్యం చేసుకోవాలని ప్రశ్నించారు. న్యాయ‌మూర్తి ఆగ్ర‌హాన్ని గ్ర‌హించిన పిటిష‌న‌ర్ చివ‌ర‌కు త‌న పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకున్నారు.

More Telugu News