Andhra Pradesh: 8 మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు

  • కోర్టు ధిక్కరణ కింద జైలు శిక్ష విధించిన హైకోర్టు
  • హైకోర్టును క్షమాపణలు వేడుకున్న ఐఏఎస్ లు
  • జైలు శిక్షను తప్పించి సేవా కార్యక్రమాలకు ఆదేశం
AP High Court sentenced Jail term to 8 IAS officers

ఏపీ హైకోర్టు ఈరోజు సంచలన తీర్పును వెలువరించింది. తమ ఆదేశాలను లెక్క చేయని ఐఏఎస్ అధికారులపై కన్నెర్ర చేసింది. ఏకంగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణ కింద 2 వారాల జైలు శిక్ష విధించింది. 

ఈ నేపథ్యంలో హైకోర్టును వీరు క్షమాపణలు కోరారు. దీంతో, వీరికి జైలు శిక్ష నుంచి విముక్తిని కలిగించిన న్యాయస్థానం... సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు నెలలో ఒకరోజు సేవ చేయాలని ఆదేశించింది. జైలు శిక్షకు గురైన అధికారుల్లో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, రాజశేఖర్, చినవీరభద్రుడు, జె.శ్యామలరావు, విజయ్ కుమార్, ఎంఎం నాయక్, శ్రీలక్ష్మి ఉన్నారు.

More Telugu News